ఎన్టీఆర్‌ను చ‌నిపోయేదాకా చంద్ర‌బాబు వ‌ద‌ల్లేదు: విజ‌య‌సాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఎన్టీఆర్‌ను చ‌నిపోయేదాకా చంద్ర‌బాబు వ‌ద‌ల్లేదు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy satires on chandrababu
  • చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి ట్వీట్లు
  • ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు అభాండాలు వేశార‌ని ఆరోప‌ణ‌
  • టీడీపీ చంద్ర‌బాబు పెట్టిన పార్టీ కాద‌న్న సాయిరెడ్డి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై టీడీపీ విమ‌ర్శ‌లు, మంగ‌ళ‌వారం జ‌రిగిన టీడీపీ 40 వసంతాల వేడుక‌ల‌పై వైసీపీ పార్ల‌మెంటరీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి బుధ‌వారం నాడు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం వ‌రుస‌గా రెండు ట్వీట్లు సంధించిన సాయిరెడ్డి.. టీడీపీ, ప్ర‌త్యేకించి చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

వెన్నుపోటు తర్వాత గుండెలు రగిలి క్షోభిస్తున్న ఎన్టీఆర్‌ను చనిపోయే వరకు చంద్ర‌బాబు వదిలిపెట్టలేద‌న్న సాయిరెడ్డి.. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని, స్త్రీ లోలుడని, అతని అవసరం రాష్ట్రానికి, పార్టీకి లేవని  అవమానించని రోజు లేదని విమ‌ర్శించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఈ క్ర‌మంలో సీఎం జగన్ ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చంద్ర‌బాబు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

ఇక టీడీపీ వేడుక‌ల‌ను టార్గెట్ చేసిన సాయిరెడ్డి.. ఎవరో (ఎన్టీఆర్) కన్న బిడ్డకు, ఇంకెవరో బర్త్ డే సెలెబ్రేట్ చేసినంత చంఢాలంగా ఉంది టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం అంటూ సెటైర్ సంధించారు. టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదన్న సాయిరెడ్డి.. ఎన్టీఆర్ నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసంటూ చుర‌క‌లంటించారు. చంద్రబాబు కపట వేషాలు చూస్తూ ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తొందోన‌ని సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
YSRCP
Vijay Sai Reddy
YSRCPP Leader

More Telugu News