మహిళల ప్రపంచకప్.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నిలకడగా ఆడుతున్న భారత్
- దక్షిణాఫ్రికాతో తలపడుతున్న మిథాలీ సేన
- తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన స్మృతి-షెఫాలీవర్మ
- 40 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన వర్మ
షెఫాలీ వర్మ 40 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించింది. మరోవైపు, క్రీజులో కుదురుకున్నాక స్మృతి కూడా దూకుడు పెంచింది. 4 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేసింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న షెఫాలీ వర్మ.. ట్రైయాన్ బౌలింగులో పరుగు కోసం యత్నించి రనౌట్ అయింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.