'మాచర్ల నియోజకవర్గం' నుంచి నితిన్ ఫస్టులుక్!
- నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం'
- రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
- కథానాయికలుగా కృతి శెట్టి - కేథరిన్
- త్వరలో రానున్న విడుదల తేదీ ప్రకటన
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి నితిన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో నితిన్ కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర ఎమోషన్ తో కూడిన యాక్షన్ తో నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ చూడగానే అర్థమైపోతుంది. ఆయన లుక్స్ లో దేనికైనా రెడీ అనే ఓ తెగింపు కనిపిస్తోంది.
గ్రామీణ నేపథ్యంలో నడిచే కుటిల రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అవినీతి రాజకీయాలకు అడ్డుకట్టవేసే యువకుడి పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, నితిన్ సరసన నాయికలుగా కృతి శెట్టి - కేథరిన్ అలరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ ప్రకటన రానుంది.