జాతరలో డ్యాన్స్ చేసిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య... వీడియో ఇదిగో!
- సిద్ధరమణ హుండి సిద్ధరామయ్య స్వగ్రామం
- సొంతూర్లో మూడ్రోజుల జాతర
- చిన్ననాటి స్నేహితులతో కలిసి జానపద నృత్యం
- వీడియోను పంచుకున్న సిద్ధరామయ్య తనయుడు
దీనికి సంబంధించిన వీడియోని సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ట్విట్టర్ లో పంచుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై భీకరంగా విరుచుకుపడే సిద్ధరామయ్య... జాతరలో ఎంతో ఉత్సాహంగా జానపద నృత్యం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.