మేఘ ఆకాశ్ నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్!
- యూత్ లో మేఘ ఆకాశ్ కి మంచి క్రేజ్
- ఈ రోజున కొత్త సినిమా షూటింగ్ లాంచ్
- రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
- కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్
ఇక ఆల్రెడీ ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'రావణాసుర' లోను ఒక కథానాయికగా ఆమె కనిపించనుంది. ఇక ఆమె చేయనున్న మరో కొత్త సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాహుల్ విజయ్ జోడిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.
సుశాంత్ రెడ్డి - అభిషేక్ కోట నిర్మిస్తున్న ఈ సినిమాతో దర్శకుడిగా అభిమన్యు పరిచయమవుతున్నాడు. హైదరాబాద్ .. గోవాలలో జరిగే షెడ్యూల్స్ తో ఈ సినిమా పూర్తికానుంది. రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిశోర్ .. అర్జున్ కల్యాణ్ కనిపించనున్నారు.