క్షీణించిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ కు త‌ర‌లింపు

  • లాలూ గుండె, కిడ్నీలో తలెత్తిన సమస్యలు
  • రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
  • పశుగ్రాసం కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న లాలూ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ గుండె, మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తాయని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించినట్టు చెప్పారు. పశుగ్రాసం కుంభకోణం కేసుకు సంబంధించి లాలూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏప్రిల్ 1వ తేదీ వరకు విచారించలేమని ఈ నెల 11న ఝార్ఖండ్ హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఐదో పశుగ్రాసం కుంభకోణంలో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది.

Lalu Prasad Yadav
Health
AIIMS
RJD

More Telugu News