హైద‌రాబాద్‌లో మ‌రో కారు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

three people died in a accident in Gachibowli
హైద‌రాబాద్‌లో రోడ్డు ప్ర‌మాదాలు నిత్య‌కృత్యంగా మారిపోయాయి. గురువారం నాడు జూబ్లీ హిల్స్‌లో వేగంగా దూసుకువ‌చ్చిన ఓ కారు రోడ్డు దాటుతున్న మ‌హిళ‌ల‌ను ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో రెండున్న‌రేళ్ల చిన్నారి మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గ‌చ్చిబౌలిలో శుక్ర‌వారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్ర‌మాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు.

తాజా ప్ర‌మాదం వివ‌రాల్లోకెళితే.. గ‌చ్చిబౌలిలోని ఎల్లా హోట‌ల్ స‌మీపంలో రోడ్డు మ‌ధ్య‌లోని చెట్ల‌కు మ‌హేశ్వ‌ర‌మ్మ (38) అనే మ‌హిళ నీళ్లు పెడుతోంది. అదే రోడ్డుపై వేగంగా దూసుకువ‌చ్చిన ఓ కారు ఆమెను బ‌లంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. మ‌హేశ్వ‌ర‌మ్మ‌ను ఢీకొట్టిన అనంత‌రం కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో కారులో ఉన్న రోహిత్‌, గాయ‌త్రిల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స‌మీపంలోని ఏఐజీ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా...చికిత్స పొందుతూ వారిద్ద‌రూ మృతి చెందారు.
Go Back to Shorts
Hyderabad
Gachibowli
Road Accident

More Telugu News