భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
- రంగులు, పూల సమ్మేళనంగా వేడుకలు
- సహజసిద్ధ రంగులతోనే జరుపుకోవాలి
- ఆరోగ్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని పవన్ ఆకాంక్ష
వసంత రుతువు వేళ వచ్చే హోలీని వసంతోత్సవంగా కూడా పిలుస్తారని పేర్కొన్న పవన్.. వేర్వేరు ప్రాంతాల ప్రజలు ఈ వేడుకలను వేర్వేరు రీతుల్లో జరుపుకుంటారని తెలిపారు. రంగులు, పూల సమ్మేళనంగా నిర్వహించుకునే ఈ హోలీ వేడుకల సందర్భంగా ప్రజల జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ వేడుకలను సహజసిద్ధమైన రంగులతోనే నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.