'సమ్మతమే' నుంచి 'బుల్లెట్టులా ..' సాంగ్ రిలీజ్!
- మరో ప్రేమకథా చిత్రంగా 'సమ్మతమే'
- కిరణ్ అబ్బవరం జోడీగా చాందిని
- సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. 'బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే' అంటూ ఈ పాట సాగుతోంది. హీరోయిన్ ప్రేమలో పడిపోయిన హీరో ఆమె ప్రతి కదలికను ప్రత్యేకంగా చూస్తుంటాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని అపురూపంగా భావిస్తుంటాడు. ఆ నేపథ్యంలో వచ్చే పాట ఇది.
శేఖర్ చంద్ర సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాటకి సామ్రాట్ సాహిత్యాన్ని అందించగా రితేశ్ ఆలపించాడు. కిరణ్ అబ్బవరం జోడీగా చాందినీ చౌదరి నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.