ఆ 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల రాజీనామాలకు సోనియా ఆదేశం
- పార్టీ పునర్వ్యవస్థీకరణపై సోనియా దృష్టి
- 5 రాష్ట్రాల పార్టీ శాఖలకు ఆదేశాలు
- తక్షణమే రాజీనామా చేయాలంటూ పీసీసీ చీఫ్‌లకు హుకుం
ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లకు చెందిన పార్టీ శాఖల చీఫ్‌లు (పీసీసీ) తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని సోనియా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాల రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నందున పీసీసీ పదవులకు రాజీనామాలు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటన విడుదల చేశారు.