బెంగళూరు టెస్టులో బుమ్రా ఫైర్... శ్రీలంక 109 ఆలౌట్
- బెంగళూరులో డే నైట్ టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 ఆలౌట్
- శ్రీలంక పనిబట్టిన బుమ్రా, షమీ, అశ్విన్
- బుమ్రాకు 5 వికెట్లు
నిన్న 3 వికెట్లు తీసిన బుమ్రా ఇవాళ ఆట ఆరంభంలోనే 2 వికెట్లు తీయగా, మిగిలిన రెండు వికెట్లను అశ్విన్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ లో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేయగా, ఎంబుల్దెనియ 21 పరుగులు చేశాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు కీలకమైన 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.