డెంగీకి హైదరాబాద్ సైంటిస్టుల కొత్త మందు.. త్వరలో మానవులపై ప్రయోగాలు
- జంతువులపై పరీక్షలు పూర్తి
- అనుమతులు వస్తే ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులపై పరీక్షలు
- పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్న పరిశోధన బృందం
జంతువులపై ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించడంతో.. ఈ ఔషధానికి అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు దాఖలు చేశారు. డెంగీ వైరస్ కు ఇప్పటి వరకు చికిత్స లేదు. యాంటీ వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నారు. కాకపోతే డెంగీకి ముందస్తు రక్షణగా టీకా అందుబాటులో ఉండడం గమనించాలి. ఈ ఔషధ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం అందిస్తోంది. డెంగీ చికిత్సకు ఎటువంటి ఔషధం లేకపోవడంతో దీన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో పరిశోధన బృందం పనిచేస్తోంది.