భారీ విడుదలకు సిద్ధమైన పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం

Puneeth Raj kumars James gets UA certificate film to release in 4000 screens on his birthday
  • జేమ్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు
  • ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై ప్రదర్శన
  • కన్నడ, తెలుగు సహా ఐదు భాషల్లో
  • సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్
దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన యాక్షన్ సినిమా ‘జేమ్స్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రాజ్ కుమార్ జయంతి అయిన మార్చి 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. దీని ప్రకారం 12 ఏళ్లలోపు పిల్లలు కూడా తల్లిదండ్రుల సమక్షంలో చూడొచ్చు. యాక్షన్ సినిమా కనుక ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ (46) గుండెపోటుతో మరణించడం తెలిసిందే. 

ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 400 థియేటర్లలో జేమ్స్ ప్రదర్శనకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించింది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, పత్తికొండ కిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
Go Back to Shorts
Puneeth Raj kumar
UA certificate
march 17th
release
James movie

More Telugu News