కేసీఆర్ కు పీకే ఉంటే, మాకు 40 లక్షల మంది ఏకే-47 లాంటి కార్యకర్తలున్నారు: రేవంత్ రెడ్డి
- డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ జోరు
- 40 లక్షల సభ్యత్వాలతో కాంగ్రెస్ నెంబర్ వన్ అన్న రేవంత్
- కాంగ్రెస్ నేతలు పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచన
ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని, కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితులను సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. అంతేకాదు, ఆ 40 లక్షల మంది అదనంగా ఒక్కో ఓటు తీసుకువచ్చినా చాలు 80 లక్షల ఓట్లు లభిస్తాయని ధీమాగా చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందినవారికి రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని రేవంత్ వెల్లడించారు.