ఆ శివుడే కేసీఆర్ సంగతి తేలుస్తాడు: విజయశాంతి
- రాజన్న ఆలయానికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఏవి?
- హామీ మేరకు ఆలయానికి ఇప్పటికి రూ.700 కోట్లు ఇవ్వాలి
- కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్న విజయశాంతి
అంతటితో ఆగని రాములమ్మ.. కేసీఆర్ పై మరింత ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు. దేవుడి విషయంలో అబద్ధం ఆడాడు. 'మీరు' అని నేను ఆయనను అనను. కేసీఆర్‌ను 'నీవు' అని పిలుస్తా. భక్తులకు ఇక్కడ ఏ సదుపాయాలు లేవు. గుడి చిన్నగా ఉంది. భక్తులు ఎక్కువగా వస్తున్నారు. చిన్న పిల్లలు, ముసలివాళ్లు ఇబ్బంది పడుతున్నారు.
ఇక అభివృద్ధి చేయండి అంటే అరెస్ట్‌లు చేయడం ఆయన నైజం. వేములవాడ ఎమ్యెల్యేను గెలిపించారు. కానీ ఆయన ఏం చేశాడు? జిల్లా మంత్రి ఉన్నాడు ఏం లాభం. సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదు. ప్రపంచం మొత్తం మోదీని మెచ్చుకుంటున్నారు. కానీ, కేసీఆర్‌కి నచ్చడం లేదు. ఆ శివుడు ఊరుకోడు. మూడో కన్ను తెరుస్తాడు. కేసీఆర్ సంగతి తేలుస్తాడు" అని విజయశాంతి విమర్శలు గుప్పించారు.