సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ ఆటగాడు.. భారత క్రికెటర్ ను ఆకాశానికెత్తేసిన పొలార్డ్
- భారత్ కోసం ఏదైనా చేయగలడు
- ప్రపంచ స్థాయి ఆటగాడు
- పదేళ్లలో ఎంతో మెరుగయ్యాడు
- అతడితో కలసి ఆడే అవకాశం అదృష్టమన్న పొలార్డ్
పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు సహచరులు కావడం గమనార్హం. సూర్యను 360 డిగ్రీల ఆటగాడిగా పొలార్డ్ అభివర్ణించాడు. ‘‘సూర్య ప్రపంచస్థాయి ఆటగాడు. అతడు 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరినప్పటి నుంచి అతడితో కలసి ఆడుతున్నాను. అప్పటి నుంచి అతడు ఎంతో మెరుగుపడడాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. 360 డిగ్రీ ఆటగాడిగా భారత్ కోసం, అతడి కోసం గొప్పగా ఏదైనా చేయగలడు’’ అని పొలార్డ్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు వేలానికి ముందు అట్టిపెట్టుకున్న నలుగురిలో సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ ఉండడం వారి పట్ల జట్టు యాజమాన్యానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనం.