ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల తెలంగాణ నేత‌ల సంతాపం

ktr talasani condolences
  • దిగ్భ్రాంతికి గుర‌య్యా: కేటీఆర్
  • మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత
  • ఆయ‌న‌ మరణం కలచివేసింది: రేవంత్ రెడ్డి
  • వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: ష‌ర్మిల‌
  • గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి త‌ల‌సాని నివాళులు
ఏపీ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారి హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ నేత‌లు సంతాపం తెలిపారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రికి వెళ్లిన తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్... గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

గౌత‌మ్ రెడ్డి మృతి చెందార‌న్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గుర‌యిన‌ట్లు  తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కేటీఆర్ సానుభూతి తెలిపారు.

గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత మరణం కలచివేసిందని ఆయ‌న ట్వీట్ చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

త‌న ప్రియ మిత్రుడు మేక‌పాటి గౌతం రెడ్డి ఇక లేర‌న్న వార్త‌ దిగ్భ్రాంతికి గురిచేసిందని ష‌ర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ష‌ర్మిల‌ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Telangana
KTR
Talasani
Sharmila
Andhra Pradesh
Mekapati Goutham Reddy

More Telugu News