నరసాపురం బయల్దేరిన పవన్... కాసేపట్లో మత్స్యకార సభకు హాజరు

Pawan Kalyan going to Narasapuram by road
  • నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ
  • రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్
  • ఘనస్వాగతం పలికిన జనసైనికులు
  • రోడ్డు మార్గంలో పవన్ నరసాపురం పయనం
ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పవన్ రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయల్దేరారు. మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన ప్రసంగిస్తారు.

కాగా, రాజమండ్రి నుంచి పవన్ రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుంటారు. పవన్ కు రోడ్డు మార్గంలో అభిమానులు, జనసైనికులు నీరాజనాలు పలికారు. పవన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
Go Back to Shorts
Pawan Kalyan
Narasapuram
Fishermen Meeting
Janasena
West Godavari District

More Telugu News