బ్యాట్లు ఝళిపించిన కోహ్లీ, పంత్, వెంకటేశ్ అయ్యర్... టీమిండియా స్కోరు 20 ఓవర్లలో 186/5
- కోహ్లీ, పంత్ అర్ధసెంచరీలు
- ధాటిగా ఆడిన వెంకటేశ్ అయ్యర్
- విఫలమైన ఇషాన్ కిషన్, సూర్యకుమార్
- రోస్టన్ చేజ్ కు 3 వికెట్లు
కోహ్లీ చాన్నాళ్ల తర్వాత సాధికారితతో బ్యాటింగ్ చేశాడు. 41 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు సాధించాడు. పంత్ కూడా ఉన్నంత సేపు బ్యాట్ కు పని చెప్పాడు. పంత్ 28 బంతుల్లోనే 52 రన్స్ రాబట్టాడు. పంత్ స్కోరులో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ 19, ఇషాన్ కిషన్ 2, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేశారు. వెస్టిండీస్ ఔలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్ 1, రొమారియో షెపర్డ్ 1 వికెట్ సాధించారు.