masks: ఇది దేశీ మాస్క్ గురూ.. ‘ఎఫ్ఎఫ్పీ 2 ఎస్’ తో మెరుగైన రక్షణ

why itis high time we upgrade our masks
షార్ట్స్‌లో చూడండి
ఈవేళ మనం ఎటు వెళ్లినా ముఖానికి మాస్క్, పాకెట్ లో శానిటైజర్ అన్నవి సాధారణమయ్యాయి. కరోనా కనుమరుగైనా, బయటకు వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం వల్ల కాలుష్యం, బ్యాక్టీరియాల నుంచి ఎంతో రక్షణ లభిస్తుంది. ఇంట్లో కార్యాలయాల్లో ధరించాల్సిన అవసరం లేకపోయినా.. బయటకు వెళ్లినప్పుడు ధరించడం మంచిదే.

2020 ఆరంభంలో కరోనా ప్రవేశించిన తర్వాత నుంచి మాస్క్ లలో ఎన్నో రకాలు చూశాం. ఎక్కువ మందికి తెలిసింది మాత్రం గుడ్డ మాస్క్. ఎక్కువ మంది ధరిస్తున్నది ఇదే. తర్వాత వాడి పడేసే సర్జికల్ మాస్క్, ఎన్95 మాస్క్. వీటికి అదనంగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ఆమోదించిన మాస్క్ కూడా ఒకటి ఉంది. అదే ఎఫ్ఎఫ్పీ2 ఎస్ మాస్క్. ఇది ఎన్95 కంటే మెరుగైన రక్షణనిస్తుంది.

వైరస్, బ్యాక్టీరియా, కాలుష్యం, దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడి రేణువులు, 0.3 మైక్రాన్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటిని ఎఫ్ఎఫ్ఫీ 2 ఎస్ మాస్క్ అడ్డుకుంటుంది. ఎలక్ట్రోస్టాటికల్లీ చార్జ్ డ్ మెల్ట్ బ్లౌన్ ఫిల్టర్లు మాస్క్ లో ఉంటాయి. ఇన్ఫెక్షన్, కాలుష్య కారకాలను ఇవి పట్టేస్తాయి.

ఎఫ్ఎఫ్పీ2 ఎస్ మాస్క్ ముఖం మొత్తాన్ని కప్పే విధంగా ఉంటుంది. గడ్డం దగ్గర నుంచి ముక్కు పై భాగం వరకు పూర్తిగా కవర్ అవుతుంది. దీంతో మరింత రక్షణనిస్తుంది. గుడ్డ మాస్క్ రక్షణ విషయంలో దిగువన ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఎన్95 మాస్క్ ధరిస్తే వైరస్ సోకిన వ్యక్తి సమక్షంలో ఉన్నప్పటికీ 25 గంటల పాటు మనకు రక్షణనిస్తుంది. అదే గుడ్డ మాస్క్ అయితే 27 నిమిషాలు కూడా రక్షణ ఉండదు. ఐటీసీ శావ్లాన్ బ్రాండ్ కింద ఎఫ్ఎఫ్పీ 2 ఎస్ మాస్కులనే
విక్రయిస్తోంది.
Go Back to Shorts
masks
protection
n95
FFP2 S
itc
savlon

More Telugu News