Etela Rajender: సమ్మక్క-సారల‌మ్మ‌ల‌కు నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించుకున్న ఈటల.. ఫొటోలు ఇవిగో

etela visits medaram
షార్ట్స్‌లో చూడండి
ఆసియాలోనే అతి పెద్ద గిరిజ‌న జాత‌ర‌ మేడారం మ‌హాజాత‌ర‌కు ఇసుక‌వేస్తే రాల‌నంత‌మంది భ‌క్తులు వ‌స్తున్నారు. సమ్మక్క-సారల‌మ్మ‌లు గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి ద‌ర్శ‌న‌మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు.

                            
ఈ క్రమంలో తెలంగాణ‌లోని హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మేడారానికి వెళ్లి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ప‌లువురు ఇత‌ర‌ బీజేపీ నేత‌లు కూడా నేడు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకోనున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే జాత‌ర‌కు వ‌చ్చి అమ్మ‌వార్ల‌కు మొక్కులు చెల్లించుకున్నారు.

           

            
       
Go Back to Shorts
Etela Rajender
medaram
BJP

More Telugu News