'రంగరంగ వైభవంగా' రిలీజ్ డేట్ ఖరారు!
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'రంగరంగ వైభవంగా'
- వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- మే 27వ తేదీన విడుదల
టైటిల్ తోనే ఇది లవ్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం తెలిసిపోతోంది. 'అర్జున్ రెడ్డి'ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. మే 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చాడు.
ఈ సినిమాలో కేతిక శర్మ అందాల సందడి చేయనుంది .. కెరియర్ పరంగా ఇది ఆమెకి మూడో సినిమా. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా మంచి క్రేజ్ ను కొట్టేసింది. ఈ సినిమాతో తాను ఇక్కడ బిజీ అవుతాననే నమ్మకంతో ఆమె ఉంది.