DK Sruthi Reddy: తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ కుమార్తెపై హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డిపై, వినోద అనే యువతిపైనా బంజారాహిల్స్ లో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎలీషాబాబు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

తాము బంజారాహిల్స్ లో పీవీపీ వరప్రసాద్ నివాసం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతున్నామని, ఈ సందర్భంగా తమను డీకే శృతిరెడ్డి దూషించిందని ఎలీషాబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇంటి స్థలం వ్యవహారంలో కొంతకాలంగా పీవీపీ, డీకే శృతిల మధ్య వివాదం నడుస్తోంది. గతంలో తమ ఇంటి గోడ కూలగొట్టారంటూ పీవీపీపై శృతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి స్థలం వ్యవహారం కోర్టు వరకు వెళ్లినట్టు తెలుస్తోంది.
DK Sruthi Reddy
SC ST Atrocity Case
Banjara Hills
Hyderabad
DK Aruna
PVP

More Telugu News