Uttar Pradesh: యూపీ రాజకీయాలకూ పాకిన ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి పాట ట్యూన్‌తో ప్రచార పాటను విడుదల చేసిన కాంగ్రెస్.. సోషల్ మీడియాలో వైరల్!

Congress launches song to tune of Srivalli from Pushpa film for UP election
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. ఆ సినిమాలోని పాటలు, డ్యాన్స్‌లు, డైలాగులు అందరినీ వెర్రెక్కిస్తున్నాయి. క్రికెటర్ల నుంచి ప్రముఖల వరకు అందరూ వాటిని అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ ఫీవర్ రాజకీయాలకూ పాకింది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ఓ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలోని ట్యూన్‌ను పుష్ప సినిమాలోని ‘చూపే బంగారామాయేనే శ్రీవల్లి..’ సాంగ్‌ నుంచి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు.  ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.

ఈ పాటను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన యూపీ కాంగ్రెస్.. యూపీ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్ జోడించింది. యూపీలో ఈ నెల 10న తొలి విడతల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 410 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
Go Back to Shorts
Uttar Pradesh
Congress
Pushpa
Srivalli

More Telugu News