పరిస్థితి చేయిదాటిపోతే చెప్పలేం.. ఇండియాలో ఐపీఎల్ నిర్వహణపై గంగూలీ

Ganguly gives clarity on IPL in India
  • కరోనా పరిస్థితి చేయిదాటిపోనంత వరకు ఇండియాలోనే నిర్వహిస్తాం
  • ముంబై, పూణేలో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తాం
  • అహ్మదాబాద్ లో మ్యాచ్ నిర్వహణపై ఇంకా ఆలోచించలేదు
కరోనా నేపథ్యంలో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. రానున్న సీజన్ కూడా విదేశాల్లోనే జరుగుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. కరోనా పరిస్థితి చేయిదాటిపోతే చెప్పలేం కానీ, లేదంటే మాత్రం ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వహిస్తామని చెప్పారు. ముంబై, పూణేలో లీగ్ మ్యాచ్ లను నిర్వహిస్తామని తెలిపారు. అహ్మదాబాద్ లో మ్యాచ్ నిర్వహించడంపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా తీవ్రత ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గత రెండు సీజన్ల ఐపీఎల్ యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Sourav Ganguly
IPL
India

More Telugu News