తగ్గిన కరోనా తీవ్రత.. తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు!
- రేపటి నుంచి స్కూళ్లను ప్రారంభిస్తామన్న సీబీఎస్ఈ పాఠశాలలు
- మరికొన్ని రోజులు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించిన కొన్ని పాఠశాలలు
- అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించిన ప్రభుత్వం
అయితే, సీబీఎస్ఈ పాఠశాలలు మాత్రం ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. మరికొన్ని పాఠశాలలు కొన్ని రోజుల పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని నిర్ణయించాయి. మరోవైపు క్లాసులను నిర్వహించే క్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.