Junior NTR: అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ ఖరారు!

RRR movie update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కుదరలేదు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మార్చి 18వ తేదీనగానీ .. ఏప్రిల్ 28వ తేదీనగాని ఈ సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ వినిపించింది. అయితే ఊహించిన దానికంటే ముందుగానే కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటు దక్షిణాది .. అటు ఉత్తరాదికి చెందిన చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతో రాజమౌళి మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
Go Back to Shorts
Junior NTR
Ram Charan
RRR Movie

More Telugu News