Vijay Devarakonda: ఇదొక 'తూఫాన్' అంటూ ఉత్కంఠ రేపుతున్న విజయ్ దేవరకొండ.. ట్విట్టర్ హ్యాండిల్ ఛేంజ్!

Vijay Devarakonda TOOFAN Thumbs Up add
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేశాడు. 'లైగర్' పాన్ ఇండియా మూవీతో ఆయన బాలీవుడ్ పై పంజా విసిరేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో ఇంకా సినిమా విడుదల కాకముందే.. ఇప్పటికే అక్కడ విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, బాలీవుడ్ భామలు సైతం విజయ్ అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయనతో నటించేందుకు సిద్ధమని ప్రకటించారు.
 
మరోవైపు విజయ్ ఈ ఉదయం నుంచి ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ను 'విజయ్ దేవరకొండ తూఫాన్'గా మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ 'తూఫాన్' (TOOFAN) అంటే ఏమిటనే దానిపై సినీ వర్గాలు, అభిమానులు చాలా క్రేజీ అయిపోయారు. ఇది కొత్త సినిమా పేరా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
 
తాజాగా 'తూఫాన్'పై క్లారిటీ వచ్చింది. విజయ్ బ్రాండ్ అంబాసడర్ గా ప్రముఖ కూల్ డ్రింక్ 'థమ్స్ అప్' కమర్షియల్ రాబోతోంది. దీనికి సంబంధించే విజయ్ ట్విట్టర్ హ్యాండిల్ ను మార్చాడు. అంతేకాదు థమ్స్ అప్ యాడ్ కు సంబంధించిన ఫొటో కూడా వచ్చింది. సముద్రం బ్యాక్ గ్రౌండ్ లో షిప్ మీదున్న విజయ్... చేతిలో థమ్స్ అప్ పట్టుకుని నిలబడ్డాడు. దీనికి కాప్షన్ గా 'సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తూఫాన్'  (Soft Drink Kaadu, idi Toofan) అని ఉంది. రేపు ఈ యాడ్ కు సంబంధించి వీడియో రాబోతోందని తెలుస్తోంది. మామూలుగానే థమ్స్ యాడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. రేపు రాబోతున్న విజయ్ యాడ్ ఇంకెంత రేంజ్ లో ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Vijay Devarakonda
Tollywood
ThumsUp
Ad

More Telugu News