ఏపీలో కొత్తగా 10,310 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 39,296 కరోనా పరీక్షలు
  • కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 12 మరణాలు
  • ఇంకా 1,16,031 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 39,296 కరోనా పరీక్షలు చేయగా... 10,310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,249 కేసులు, కృష్ణా జిల్లాలో 1,008 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 9,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 14,606 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,70,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,39,854 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,16,031 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News

Andhra Pradesh Corona Virus Daily Bulletin Today Cases