ఏఐ ఎఫెక్ట్.. 1,100 మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్‌ఫ్లేర్
- ఏజెంటెక్ ఏఐ యుగానికి సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయమన్న సంస్థ
- ఇది ఖర్చుల కోత చర్య కాదని స్పష్టం చేసిన యాజమాన్యం
- గత మూడు నెలల్లో ఏఐ వినియోగం 600 శాతం పెరిగిందని వెల్లడి
- భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి కోతలు ఉండవని హామీ
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సంచలన నిర్ణయం తీసుకుంది. "ఏజెంటెక్ ఏఐ" యుగానికి సిద్ధమయ్యే క్రమంలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో 20 శాతానికి సమానం. గురువారం తమ మొదటి త్రైమాసిక ఆదాయ వివరాలు వెల్లడించిన అనంతరం, ఉద్యోగులకు ఈ విషయం తెలియజేసింది.
ఇది ఖర్చుల కోత కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ఏఐ యుగంలో కంపెనీని పునర్నిర్మించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు క్లౌడ్‌ఫ్లేర్ సహ వ్యవస్థాపకులు మాథ్యూ ప్రిన్స్, మిషెల్ జాట్లిన్ ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు. గత మూడు నెలల్లోనే కంపెనీలో ఏఐ వినియోగం 600 శాతానికి పైగా పెరిగిందని వారు తెలిపారు. ఇంజినీరింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్‌తో సహా అన్ని విభాగాల్లో వేలకొద్దీ ఏఐ ఏజెంట్ సెషన్లు నడుస్తున్నాయని, అందుకే కంపెనీ నిర్మాణాన్ని మార్చాల్సి వస్తోందని వివరించారు.
ప్రస్తుతానికి ఈ తొలగింపుల ప్రక్రియ ఒక్కసారికే పరిమితమని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి కోతలు ఉండవని యాజమాన్యం హామీ ఇచ్చింది. పదే పదే చిన్న కోతలు విధించడం వల్ల ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంటుందని, అందుకే ఒకేసారి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఏఐ ఆధారిత ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయి కంపెనీ ఎలా పనిచేస్తుందో నిర్వచించడమే తమ లక్ష్యమని తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు పరిశ్రమలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.