'పుష్ప' మేనియా మామూలుగా లేదు.. సురేశ్ రైనా డ్యాన్స్ వీడియో ఇదిగో
- బన్నీపై రైనా ప్రశంసలు
- అద్భుతంగా నటించాడని వ్యాఖ్య
- బన్నీలా డ్యాన్స్ చేసిన రైనా
ఇద్దరితో కలిసి ఆయన ఈ స్టెప్పులు వేసి పలు విషయాలు చెప్పాడు. తాను పుష్ప సినిమా చూశానని, అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని తెలిపాడు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. శ్రీవల్లి పాటకు ఏదో ఇలా డ్యాన్స్ చేస్తున్నానని తెలిపాడు.
కాగా, ఇటీవలే భారత క్రికెటర్ రవీంద్ర జడేజా మరోసారి పుష్ప రాజ్‌లా తయారై ఫొటో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పుష్ప హంగామా మామూలుగా లేదు. ఎర్రచందనం కథాంశంతో ఈ సినిమాను సుకుమార్ తనదైన రీతిలో తెరకెక్కించడంతో పాటు అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి వారు అద్భుతంగా నటించారు. దీంతో ఈ సినిమా ఇంతటి భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం దేశ వ్యాప్తంగా అలరించింది. అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.