మారుతి కార్ల ధరలు మరోసారి పెరిగాయి!
- ఉత్పత్తి వ్యయం అధికం
- లోహాలు, ప్లాస్టిక్ ధరలు పెరిగిన వైనం
- తాము కూడా పెంచక తప్పడంలేదన్న మారుతి
- ఈసారి ఏకంగా 4.3 శాతం పెంపు
మారుతి సంస్థ 2021లో మూడు పర్యాయాలు ధరలు పెంచింది. గతేడాది స్వల్ప మొత్తంలో ధరలు పెంచిన ఈ కార్ల తయారీ దిగ్గజం, ఈసారి భారీగా పెంచింది. మారుతి సుజుకి సంస్థ ఆల్టో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఈకో, ఎర్టిగా, ఎస్ ప్రెసో, బ్రీజా, డిజైర్, బాలెనో, నెక్జా ఎస్ క్రాస్ వంటి వాహనాలను విక్రయిస్తూ భారత మార్కెట్ లో పట్టు సాధించింది.