తెలంగాణలో మరో 2,707 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 84,280 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 20,462 మందికి చికిత్స
అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,02,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,78,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,462 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,049కి పెరిగింది.
