జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఫైళ్లు!

Fire accident in GHMC office
  • సికింద్రాబాద్ జోనల్ మున్సిపల్ కార్యాలయం మూడో అంతస్తులో మంటలు
  • భయంతో పరుగులు తీసిన సిబ్బంది
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది
సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. జోనల్ మున్సిపల్ కార్యాలయంలోని మూడో అంతస్తులో ఉన్న పన్నుల విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కాలిపోయాయి. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. దీంతో కాసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.

 మరోవైపు ఈ అగ్ని ప్రమాదంతో కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ప్రమాద సమయంలో లిఫ్టులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. చాలా మంది ఐదో అంతస్తులో చిక్కుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వారంతా క్రేన్ సాయంతో కిందకి దిగారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Go Back to Shorts
GHMC
Office
Fire Accident

More Telugu News