"ఊ అంటావా మావా ఊఊ అంటావా"... చిన్నారి పాటకు సమంత ఫిదా
- పుష్ప చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్
- "ఊ అంటావా మావా ఊఊ అంటావా" అంటూ గీతం
- హస్కీ వాయిస్ తో ఆలపించిన ఇంద్రావతి చౌహాన్
- యూట్యూబ్ లో ఊపేస్తున్న పాట
తాజాగా ఇంటర్నెట్లో ఓ వీడియో సందడి చేస్తోంది. ఆ వీడియోను సమంత తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకుంది. ఓ తల్లి తన కుమార్తెతో హోమ్ వర్క్ చేయిస్తూ... డబ్ల్యూహెచ్ఓ హూ అనే ఆంగ్ల పదాన్ని చదివించే ప్రయత్నం చేయగా... ఆ పదాన్ని చూసిన చిన్నారి "ఊ అంటావా మావా ఊఊ అంటానా" అని పాట ఎత్తుకుంది. అందుకు ఆ తల్లి స్పందిస్తూ.. "ఊ కాదు హూ" అని చెబితే మరోసారి ఆ చిన్నారి పాట పాడడం పట్ల సమంత ముగ్ధురాలైంది.