ఏపీలో మరో 10 ఒమిక్రాన్ కేసుల వెల్లడి

Ten more Omicron positive cases identified in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు కువైట్, సౌదీ అరేబియా, అమెరికా, నైజీరియా నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారిని కలిసిన మరో ముగ్గురికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.

బాధితులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి పెరిగింది.
Go Back to Shorts
Omicron
Positive Cases
Andhra Pradesh
New Variant
Corona Virus

More Telugu News