దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్.. 653కు చేరిన ఒమిక్రాన్ కేసులు
- దేశంలో కొత్తగా 6,358 కరోనా కేసులు
- రికవరీ రేటు 98.40 శాతం
- తెలంగాణలో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు
- ఆంధ్రప్రదేశ్‌లో 6 కేసుల నమోదు
మరోపక్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 186 మంది కోలుకున్నారని వివరించింది. తెలంగాణలో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, వారిలో 10 మంది కోలుకున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు కోలుకున్నారని పేర్కొంది.