గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే... ప్రస్తుత సీఎం మాటలతో మోసం చేస్తున్నారు: సోము వీర్రాజు విమర్శలు
- ఏపీకి జగన్, చంద్రబాబు చేసిందేమీ లేదు
- వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
- వీరిద్దరూ స్టిక్కర్ సీఎంలు
రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఆనాడే ఆయన అభివృద్ధి చేసి ఉంటే... అమరావతి రైతులు ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి వచ్చుండేది కాదని అన్నారు. కమ్యూనిస్టులు కమీషన్ ఏజెంట్లుగా మారారని విమర్శించారు. దేశంలో విద్యావ్యవస్థ నాశనం కావడానికి కమ్యూనిస్టులే కారణమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే... వైసీపీ ప్రభుత్వం డబ్బులు మళ్లిస్తోందని వీర్రాజు మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి మోదీ వేసిన డబ్బులను జగన్ లాగేసుకున్నారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.