దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌.. మ‌రిన్ని పెరిగిన ఒమిక్రాన్ కేసులు

corona bulletin in inida
  • దేశంలో కొత్త‌గా 6,650 క‌రోనా కేసులు
  • నిన్న‌ 374 మంది మృతి
  • మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 4,79,133
  • ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358
దేశంలో కొత్త‌గా 6,650 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 7,051 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 374 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 77,516 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.

క‌రోనా నుంచి మొత్తం 3,42,15,977 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల సంభ‌వించిన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 4,79,133 అని వివ‌రించింది. దేశంలో న‌మోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కు చేరింద‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 140,31,63,063 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించిన‌ట్లు వివ‌రించింది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News