ఎడ్లు, గుర్రం, కోడి పందేలకు అనుమతిని ఇవ్వండి: జగన్ కు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham writes letter to Jagan
  • సంక్రాంతి, ఉగాది పండుగల సమయాల్లో ఆటలకు అనుమతి ఇవ్వాలి
  • ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు
  • పండుగ సమయాల్లో జనాలు జైలుకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎడ్లు, గుర్రం, కోడిపందేలు వంటివాటిని నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని లేఖలో ఆయన కోరారు. సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో గుర్రం, కోడి పందేలు, ఎడ్లు బరువు లాగే పోటీలు తదితర కార్యక్రమాలను ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని చెప్పారు.

అయితే, పండుగ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇబ్బందులు పెట్టడం, ఆ తర్వాత చివర్లో అనుమతిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజుల పాటు అన్ని ఆటలకు పూర్తి స్థాయిలో అనుమతులను ఇవ్వాలని, పండుగల సంతోష సమయాల్లో జనాలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎంను ముద్రగడ కోరారు.
Go Back to Shorts
Mudragada Padmanabham
Jagan
YSRCP
Letter

More Telugu News