హైదరాబాద్‌లో ఘనంగా స్వలింగ సంపర్కుల వివాహం.. తల్లిదండ్రులు, స్నేహితుల కోలాహలం మధ్య వేడుక
- మొయినాబాద్ రిసార్ట్‌లో ఘనంగా మెహందీ ఫంక్షన్, సంగీత్
- తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం
- హాజరైన ఎల్‌జీబీటీ కమ్యూనిటీ సభ్యులు
తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన వీరు అనుకున్నట్టే పెద్దల సమక్షంలో ఒక్కటై వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. వివాహం అనంతరం సుప్రియో మాట్లాడుతూ.. 2012లో తనకు అభయ్‌తో పరిచయం అయినట్టు చెప్పారు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నెల రోజుల క్రితం నిర్ణయించుకున్నామన్నారు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు చెబితే మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పారు. నిజానికి తమ వివాహానికి చట్టబద్ధత లేదని, అయినప్పటికీ ఘనంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నామని, అనుకున్నట్టే ఘనంగా వివాహం చేసుకున్నామని సుప్రియో వివరించారు.