వచ్చే రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది: యూరోపియన్ హెల్త్ కమిషనర్
- డెల్టా కంటే వేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్
- అమెరికా మొత్తం కేసుల్లో మూడు శాతం ఒమిక్రాన్ కేసులే
- 75 దేశాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్
ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ ను డామినేట్ చేసే ఆధిపత్య జాతిగా ఒమిక్రాన్ పురోగమిస్తుందని హెచ్చరించారు. 2022 తొలి రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ తెలిపారు. పండుగ సమయాల్లో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.