సుకుమార్ నాకు కథ చెప్పింది పది నిమిషాలే: బన్నీ
- సుకుమార్ తో ఇది మూడవ సినిమా
- రెండు భాగాలు చేయాలని ముందుగా అనుకోలేదు
- అడవిలో ఎన్నో కష్టాలు పడ్డాం
- హిట్ కొడతామనే నమ్మకం ఉందన్న బన్నీ
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఆర్య .. ఆర్య 2 తరువాత నేను .. సుకుమార్ మరో సినిమా చేయాలనుకున్నాం .. అది ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా కథను సుకుమార్ నాకు 10 నిమిషాలు మాత్రమే చెప్పాడు. ఆ తరువాత కథ ఏమిటి అనేది వినకుండానే ఓకే చెప్పేశాను.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన గానీ, పాన్ ఇండియా స్థాయిలో చేయాలనే ఆలోచన గాని ముందుగా లేవు. ఆ తరువాత కథాబలం కారణంగా ఈ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. అడవిలో ఎన్నో కష్టాలు పడుతూ ఈ సినిమా చేశాము. అందుకు తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.