స్పెషల్ సాంగ్స్ చేయను: రష్మిక
- 'పుష్ప'లో బన్నీ సరసన రష్మిక
- శ్రీవల్లి పాత్రలో సందడి
- ప్రత్యేక గీతంలో సమంత
- ఈ నెల 17వ తేదీన విడుదల
"ఈ సినిమాలో నేను శ్రీవల్లి పాత్రను పోషిస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అంతలా ఈ పాత్ర పేరు జనంలోకి వెళ్లింది. తెరపై శ్రీవల్లి కాస్త క్యూట్ గా .. మరికాస్త కన్నింగ్ గా కనిపిస్తుంది. ఇంతవరకూ నేను చేసిన పాత్రల్లో నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. ఈ పాత్రకి పడే మార్కులు అన్నీ కూడా సుక్కూ సార్ కే వెళతాయి.
'సామీ సామీ' సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం .. కాకపోతే ఆ పాట మూమెంట్స్ చాలా కష్టంగా అనిపించాయి. ఆ పాట కోసం చాలా హార్డు వర్క్ చేయవలసి వచ్చింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అవుతుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసి నేను షాక్ అయ్యాను. నాకు మాత్రం స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన లేదు" అని చెప్పుకొచ్చింది.