రావత్ సహా అమర జవాన్ల భౌతికకాయాలకు ఘన నివాళులు అర్పించిన మోదీ
- ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో అమర జవాన్లకు మోదీ నివాళులు
- హాజరైన రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల చీఫ్ లు
- రేపు సాయంత్రం 4 గంటలకు రావత్ దంపతుల అంత్యక్రియలు
అంతకుముందు అమర జవాన్ల భౌతికకాయాలను తమిళనాడు నుంచి సీ130-జే సూపర్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఢిల్లీకి తరలించారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలను ఢిల్లీలోని వారి నివాసం వద్ద రేపు ఉదయం 11 గంటల నుంచి సందర్శకుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్కేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తారు.