హెలికాప్టర్ ప్రమాదం.. మిలిటరీ ఆసుపత్రిలో బిపిన్ రావత్.. పరిస్థితి విషమం!

Bipin Rawat condition critical
  • తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
  • ప్రమాదంలో రావత్ సతీమణి మృతి చెందినట్టు సమాచారం
  • ఇంతవరకు ఐదుగురు చనిపోయినట్టు వార్తలు
తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మొత్తం 14 మంది చాపర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్టు సమాచారం. వీరిని దగ్గర్లో ఉన్న వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిపిన్ రావత్ సతీమణి మృతి చెందినట్టు అనధికారికంగా తెలుస్తోంది. బిపిన్ రావత్ బతికే ఉన్నారని... అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంత వరకు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Go Back to Shorts
Bipin Rawat
CDF
Condition
IAF

More Telugu News