సిరివెన్నెల నివాసానికి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
- కొన్నిరోజుల కిందట సిరివెన్నెల కన్నుమూత
- కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
- తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
- పరామర్శించిన తమిళిసై
ఇవాళ ఆమె హైదరాబాదులోని సిరివెన్నెల నివాసానికి వెళ్లారు. అక్కడ సిరివెన్నెల చిత్రపటానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల అర్ధాంగితో మాట్లాడి ఓదార్పు వచనాలు పలికారు. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కుటుంబ సభ్యులను కూడా గవర్నర్ తమిళిసై పరామర్శించారు.