వరదబాధితుల సహాయార్థం ప్రభాస్ భారీ విరాళం
- భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్
- పెద్ద ఎత్తున విరాళాలను అందిస్తున్న సినీ ప్రముఖులు
- కోటి రూపాయల విరాళాన్ని అందించిన ప్రభాస్
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించనున్నారు. గతంలో కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రభాస్ భారీ విరాళాలను అందించారు.