చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం జగన్

CM Jagan visits flood affected areas in Chittoor district
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో ఇటీవల వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. నిన్న కడప జిల్లాలో పర్యటించిన సీఎం నేడు చిత్తూరు జిల్లా వెళ్లారు. రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలకు అధికారులు వచ్చారా? సాయం అందించారా? అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ పాపానాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. జిల్లాలో వరద తీవ్రతకు గురైన రహదారులు, భవనాలు, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖకు సంబంధించిన ఫొటోలతో ఏర్పాటైన ఎగ్జిబిషన్ ను కూడా సీఎం పరిశీలించారు.

అటు, తిరుపతి నగరంలోనూ ఆయన పర్యటన కొనసాగింది. తిరుపతి కృష్ణా నగర్ లో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
CM Jagan
Chittoor District
Floods
Tour
Andhra Pradesh

More Telugu News