యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్.. మనకు కూడా ఒమిక్రాన్ ముప్పు ఉందన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్!
- బాధిత మహిళకు టిమ్స్ లో వైద్యం
- ఆమె శాంపిల్స్ జెనెటిక్ సీక్వెన్సింగ్ కు పంపించామన్న హెల్త్ డైరెక్టర్
- ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వ్యాఖ్య
బాధితురాలిని మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచామని శ్రీనివాసరావు చెప్పారు. ఆమె రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. అయితే ఆమె బంధువుకు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ అని తేలిందని చెప్పారు. మనకు కూడా ఒమిక్రాన్ ముప్పు ఉందని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొత్త వేరియంట్ పై మూడు గంటల సేపు చర్చించామని తెలిపారు.
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే 24 దేశాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరగలేదని.. అందుకే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్టు నిపుణులు చెపుతున్నారని అన్నారు.
అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మాస్కు ధరించాలని... లేకపోతే మన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒమిక్రాన్ బారిన పడిన రిస్క్ దేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన మహిళ వచ్చిన యూకే కూడా రిస్క్ దేశాల జాబితాలో ఉంది.